బాబుకి మైండ్‌బ్లోయింగ్ షాక్! నా మద్దతు జనసేనకే!

10:47 am, Tue, 19 March 19
my support to Janasena, Jr NTR News , AP Political Updates News, Newsxpressonline

హైదరాబాద్: ఇప్పుడు ఏపీలో ఎన్నికల జోరు ఊపందుకుంది.అయితే ఇలా ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కొంత మంది హీరోలకు తలనొప్పిగా మారే అంశాలు కొన్ని ఉంటాయి.ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వద్దాం.జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమా రంగంలో ఎంత మంది సన్నిహితులు ఉన్నారు అలాగే రాజకీయ రంగంలో కూడా చాలా మంది సన్నిహితులు ఉన్నారు.

కొడాలి నాని వల్లభనేని వంశీ వారిలో ప్రముఖులు.వీరిద్దరి తరుపున ఎన్టీఆర్ ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇక కొడాలి నాని టిడిపి లో ఉన్నంత వరకు జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి సమస్య రాలేదు.కానీ వైసిపి లోకి మారగానే ఎన్టీఆర్ పై ఫోకస్ చేశారు టిడిపి వారు మరియు వైఎస్ఆర్సిపి వారు.అంతేకాకుండా కొడాలి నాని వైసీపీ బ్యానర్ పై జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో వేయడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారు వైఎస్సార్సీపీ ప్రచారానికి వస్తున్నట్లు ప్రచారం కొనసాగింది.

జనసేన తరపున ప్రచారానికి సిద్దమౌతున్న జూనియర్..

చివరికి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రెస్మీట్ పెట్టి టీడీపీ మా తాతగారు గారు స్థాపించిన పార్టీ చివరి వరకు నేను టిడిపితోనే ఉంటాను అని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక వార్త బయటకు వచ్చింది.ఇక ఆయనపై వచ్చిన వార్త ఏంటంటే, చరణ్ ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు.

సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది,ఈ షూటింగ్ సమయంలో చరణ్ ఎన్టీఆర్ ని ఏపీ ఎన్నికల గురించి అడిగారట,ఏ పార్టీకి సపోర్ట్ చేస్తావ్ అని దానికి మొహమాటం లేకుండా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తాను అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారట,వెంటనే చరణ్ నవ్వగా జూనియర్ ఎన్టీఆర్ మీ బాబాయ్ అని అలా అనడం లేదు.

నేను రాజకీయాలను ఫాలో అవుతూ ఉంటా ప్రస్తుతం ఏపీ లో జనసేన ని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పాడట,ప్రజల కోసం మీ బాబాయి ఆలోచనా విధానం మా తాతయ్య ని గుర్తు చేసే విధంగా ఉన్నాయి,అందుకే ఇప్పటికిప్పుడు ఏపీ రాజకీయాల గురించి నన్ను ఎవరైనా అడుగుతే జనసేన పార్టీ గురించి చెప్తాను అని అన్నారని వార్తలు వస్తున్నాయి.