పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం.. జగన్‌ను అభినందించిన మంత్రులు

6:39 pm, Fri, 19 June 20
ap cm ys jagan responded on vizag lg polymers industry gas lekage incident

తాడేపల్లి: సీఏఏకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ విప్ గండికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముస్లిం మైనార్టీల ఆందోళన విషయంలో ప్రభుత్వం పూర్తి అవగాహనతో ఉందని పేర్కొన్నారు. వారికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వివాదస్పద ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ బిల్లులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, గతంలో పేర్కొన్న విధానానికే తాము కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.