స్వయంగా అంబులెన్సు బైక్ నడిపి.. అందరినీ ఆకట్టుకున్న ఎమ్మెల్యే రోజా!

6 days ago

నగరి: ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నగరిలో ఆదివారం స్వ‌యంగా అంబులెన్స్‌ బైక్‌ నడిపారు.

నగరిలోని శ్రీసిటీ హీరో మోటార్‌ సంస్థ.. ఎమ్మెల్యే రోజా చేతులమీదుగా రెండు అంబులెన్స్‌ బైక్‌లను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేసింది.

జెండా ఊపి వాటిని ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా ఆ తరువాత స్వయంగా ఓ బైక్‌ను నడిపి అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ )లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచార‌ని కొనియాడారు. 

ఇన్నాళ్లూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు. 

వీరిద్దరి అబద్ధాలకు చెంపపెట్టులా పారిశ్రామికవేత్తలు సీఎం వైఎస్‌ జగన్‌పై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారని వ్యాఖ్యానించారు.

చివరికి ఈ ర్యాంకును కూడా టీడీపీ తమ ఘనతేనని చెప్పుకోవడం వారి చీప్‌ పాలిటిక్స్‌కు నిదర్శనమంటూ రోజా ధ్వ‌జ‌మెత్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీసిటీ హీరో మోటార్స్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.