నా భర్తకు వస్తున్న మంచి పేరు చూసి ఓర్వలేకే హత్య: మోకా భాస్కరరావు భార్య

- Advertisement -

మచిలీపట్నం: తన భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు భార్య వెంకటేశ్వరమ్మ ఆరోపించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని తాను కలలో కూడా ఊహించలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

తన భర్తకు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే రవీంద్ర తన అనుచరులతో ఈ దురాగతానికి పాల్పడ్డారని అన్నారు. కొల్లు రవీంద్ర అక్రమాలను ప్రశ్నించిన తన భర్తను హతమారుస్తారన్న ఆలోచన తమకు ఎప్పుడూ రాలేదన్నారు.

- Advertisement -

ఈ హత్యతో ఎలాంటి ప్రమేయమూ లేకపోతే రవీంద్ర అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లిపోయారని వెంకటేశ్వరమ్మ ప్రశ్నించారు. తన భర్త హత్యకేసులో ప్రమేయం ఉన్న అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

- Advertisement -