ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామా.. ఆమోదం

- Advertisement -

అమరావతి: రాజ్యసభకు ఎన్నికైన ఏపీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా, వారి రాజీనామాలను ఆమోదించినట్టు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. వీరిద్దరి రాజీనామాలు ఆమోదం పొందడంతో శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.

మరోవైపు మంత్రి పదవులకు కూడా పిల్లి సుభాష్, మోపిదేవిలు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి జగన్‌కు అందజేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో వాటి కోసం వైసీపీలో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఆశిస్తున్న నేతల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -