మూడేళ్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తాం: ఎంపీ అవినాష్

MP Avinash Latest News, Kadapa Latest News, YCP Latest Updates , Newsxpressonline
- Advertisement -

కడప: రాయలసీమ వాసుల చిరకాల కోరిక కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడేళ్లలోనే పూర్తి చేస్తామని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…త్వరలోనే కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

కేవలం మూడేళ్ల కాలంలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామని, దీనివల్ల రాష్ట్రంలో 20,000 నుంచి 25 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అటు ఏపీకి ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌లో తమ గళం గట్టిగా వినిపిస్తామని అన్నారు.

ఇక జిల్లాకు సాగు, తారునీరు అందించే గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 12 నుంచి 26 టీఎంసీలకు పెంచుతామని, ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపను అభివ‌ృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, గతంలో కేంద్ర ప్రభుత్వం కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో చేతులు ఎత్తేయడంతో…టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు..ఎన్నికలకు ముందు స్టీల్ ఫ్యాక్టరీకి శంఖుస్థాపన చేశారు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో…ఇప్పుడు ఆ బాధ్యతని వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. మరి చూడాలి వైసీపీ అనుకున్న సమయానికి స్టీల్ ఫ్యాక్టరీని పూర్తి చేసి…రాయలసీమ వాసుల చిరకాల కల నెరవేరుస్తుందో లేదో.

చదవండి: ఆగస్టులో వాలంటీర్లు..అక్టోబర్‌లో గ్రామ సచివాలయం ఉద్యోగుల నియామకాలు
- Advertisement -