టీడీపీకి మళ్ళీ అధికారం కష్టమే!: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

jc sensetional comments on cm chandrababu

అమరావతి: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇలా చేయడం కొత్తేం కాదు. తనదైన శైలిలో ఎప్పుడూ తన హాట్ కామెంట్స్‌తో అందరూ అవాక్కయ్యేలా చేయడం దివాకర్ రెడ్డికి అలవాటు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తన పార్టీ గురించే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పలువురు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలనే ఈసారి టార్గెట్ చేశారు. అంతేకాదు, రానున్న ఎన్నికల్లో 40 శాతం మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకపోతే టీడీపీ గట్టెక్కడం కష్టమేనని ఆయన తేల్చేశారు.

మరోసారి మోడీ రావడం పక్కా…

ఇక ముఖ్యమంత్రి చంద్రాబాబునూ ఆయన వదల్లేదు.  చంద్రబాబు విషయంలో తనకు కూడా చిన్నచిన్న అభ్యంతరాలు ఉన్నాయంటూ కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు మాత్రం తనను చూసి ఓట్లేస్తారని అనుకుంటున్నారని….. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొందరిని మార్చకపోతే ఈసారి టీడీపీకి ఓట్లు పడవని కూడా జేసీ కామెంట్స్ చేశారు.

అంతేకాదు, దేశ రాజకీయాల గురించి కూడా దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇలాగే ఉద్రిక్తంగా ఉంటే, నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో కూడా జేసీకి విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి: ఇక కాచుకో చంద్రబాబు! నేనొస్తున్నా.. జగన్ తరఫున ప్రచారం చేస్తా: అసదుద్దీన్ ఓవైసీ

 

1 COMMENT