అలాచేస్తే బయటపడొచ్చు.. అచ్చెన్నకు విజయసాయిరెడ్డి సలహా

3:41 pm, Mon, 15 June 20

అమరావతి: ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు. తనకు తెలిసిన నిజాలన్నీ బయటపెట్టేస్తే కేసు నుంచి

బయటపడొచ్చేమో చూడండి అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తన ట్వీట్‌లో టార్గెట్ చేశారు. చంద్రబాబుపై తీవ్రమైన స్థాయిలో మండిపడ్డారు.

‘‘అచ్చెన్న కచ్చితంగా బాబు గారి బినామీనే. ఆయన ద్వారానే భూముల కొనుగోళ్లు, వ్యాపారాల్లో వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టారని సొంత పార్టీలో చర్చించుకుంటున్నారు. బాబు రాయమంటేనే సిఫారసు లేఖలు

రాసానని అంగీకరించి, గుట్లు మట్లన్నీ చెప్పేస్తే కేసు నుంచి బయటపడొచ్చేమో చూడండి అచ్చెన్నా’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

తమలోతమకు తగవులు పెట్టడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నాడంటూ ఆరోపిస్తున్నాయి.