పవన్ కళ్యాణ్‌ను ఇరికించిన నాగబాబు! ఐటి సబ్జెక్ట్‌లో డిగ్రీ హోల్డర్ అని పేర్కొంటూ…

7:10 am, Mon, 22 April 19
naga-babu

హైదరాబాద్: రాజకీయ నాయకులు, సినిమా రంగంలోని సెలెబ్రెటీలు చేసే కామెంట్స్‌లో తప్పులు వెతుకుతూ నెగిటివ్ కామెంట్స్ పెరిగిపోతున్న పరిస్థితుల్లో యధాలాపంగా ఎవరైనా ఏదైన ఒక కామెంట్ చేస్తే ఆ కామెంట్‌ను టార్గెట్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఇది మరీ ఎక్కువ.

ఇలాంటి సందర్భంలో మెగా బ్రదర్ నాగబాబు.. కొద్ది రోజులుగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్ధులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిపై తన వెబ్ ఛానల్‌లో చేసిన కామెంట్స్ అనుకోకుండా మళ్ళీ పవన్ వ్యతిరేకులకు ఒక అవకాశంగా మారింది.

విద్యార్ధుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలు, కార్పొరేట్ కాలేజీల తీరు, ఎడ్యుకేషన్ సిస్టంలో లోపాలతోపాటు తల్లిదండ్రుల ప్రవవర్తన కూడ కారణమంటూ నాగబాబు లోతైన విశ్లేషణలు చేశారు.

అంతటితో ఆగకుండా.. తాను ఎల్‌ఎల్‌బి చదివాననీ, తన సోదరుడు చిరంజీవి డిగ్రీ చేశాడనీ, ఒక చెల్లెలు ఎంబీబీఎస్, మరొక చెల్లెలు డిగ్రీ చదివారని, పవన్ కళ్యాణ్ ఐటి సబ్జెక్ట్‌లో డిగ్రీ హోల్డర్ అని నాగబాబు పేర్కొన్నారు. సరిగ్గా ఈ వ్యాఖ్యలే మరొకసారి పవన్ వ్యతిరేకులకు ఆయుధంగా మారాయి.

ఈమధ్య జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో నాగబాబు సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన అఫిడవిట్‌లో తను పదో తరగతి పాసయ్యానని స్పష్టం చేస్తే.. ఇప్పుడు నాగబాబు ఏమో ఆయన ఐటి సబ్జెక్ట్స్‌తో డిగ్రీ చేశారని చెబుతున్సారు.. ఇంతకీ ఈ రెండింటిలో ఏది నిజం అంటూ పవన్ వ్యతిరేక వర్గాలు అప్పుడే కామెంట్స్ మొదలుపెట్టేశాయి.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన దగ్గర్నించి.. ఆయనపై కామెంట్స్ చేయడానికి ఒక వర్గం ఎప్పుడూ రెడీగా ఉంటోన్న  పరిస్థితులలో అనుకోకుండా ఆయన సోదరుడు నాగబాబు తన కామెంట్స్‌తో పవన్‌ను ఇరికించేశారంటూ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.