బోటు ప్రమాద ఘటనలో గల్లంతైన.. బయటపడిన వారి వివరాలు

10:18 am, Mon, 16 September 19
boat-accident-in-devipatnam-of-godavari

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో నిన్న జరిగిన బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది, స్థానికులు నదిలో గాలిస్తున్నారు.

ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు

హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన అంకం శివజ్యోతి, అంకం పవన్ కుమార్, అంకం వసుంధర, అంకం సుశీల్, పట్టిసీమకు చెందిన మణికంఠ, వరంగల్ జిల్లా కడిపికొండకు చెందిన బసికె అవినాశ్, సునీల్, ధర్మరాజు, వెంకటయ్య, డ్రైవర్ నూకరాజు, డ్రైవర్ సత్యనారాయణ, శెట్టిపల్లి గంగాధర్, వి.రఘురాం, బాలు, రమణ, అరుణ, అశిలేశ్, శాలీ. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. 

ప్రమాదం నుంచి బయటపడిన వారి వివరాలు

వరంగల్ జిల్లాలోని కడిపికొండకు చెందిన ఆరపల్లి యాదగిరి, బసికె దశరథ్, బసికె వెంకటస్వామి, దర్శనాల సురేశ్, గొర్లె ప్రభాకర్, హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన చింతామణి జానకిరామ్, కోదండ అర్జున్, ఎండీ మజురద్దీన్, నార్లపురం సురేశ్, సోరేటి రాజేశ్, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన గల్లా శివశంకర్, చిట్యాలకు చెందిన మేడి కిరణ్ కుమార్, అనకాలపల్లి గోపాలపురానికి చెందిన బోసాల లక్ష్మి, తిరుపతికి చెందిన దుర్గం మధులత, హనుమాన్ జంక్షన్‌కు చెందిన మద్దెల జోజిబాబు, ఉంగరాల శ్రీను, నరసాపురానికి చెందిన మండల గంగాధర్, హైదరాబాద్‌కు చెందిన పాడి జననీ కుమార్, గొల్లపూడికి చెందిన కర్ణపు గాంధీ, కడపకు చెందిన కంచా జగన్నాథరెడ్డిలు ఉన్నారు.