చేతకాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా?: వైఎస్ జగన్‌పై.. లోకేశ్ మండిపాటు

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నియంత పాలన నడుస్తోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు.

చదవండి: కరోనా వైరస్: తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. మృతుల అంత్యక్రియలపై మార్గదర్శకాలు విడుదల!

మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు కొనడానికి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదని, కరోనాని ఎలా నియంత్రించాలని అడిగినందుకు నగరి కమిషనర్ వెంకట్ రామిరెడ్డిని సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.

‘‘జగన్‌కు ఎలాంటి శిక్ష వేయాలి?’’

అసలు కరోనా పెద్ద విషయం కాదని, ఎన్నికలే ముఖ్యమని నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా వ్యాప్తికి కారణం అయిన జగన్ గారికి ఎటువంటి శిక్ష వేయాలని లోకేశ్ ప్రశ్నించారు.

జగన్ అసమర్ధత వల్ల కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లాలో ఇద్దరు డాక్టర్లు,ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా సోకిందని, వైద్యులు  విధులు బహిష్కరించే పరిస్థితి వచ్చిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

- Advertisement -