ప్రభుత్వ వక్ర బుద్ధి బయటపడుతోంది.. నారా లోకేష్ ధ్వజం

- Advertisement -

అమరావతి: అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ తర్వాత పరిణామాలపై టీడీపీ నేత నారా లోకేష్ దృష్టి సారించారు.

అరెస్టు తర్వాత హుటాహుటిన అమరావతి చేరుకున్న లోకేష్.. అచెన్నాయుడు కుటుంబ సభ్యులు, ముఖ్యనేతలతో మాట్లాడారు. అచ్చెన్నను ఎలాగైనా కొన్ని రోజులు జైలులో ఉంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అంటూ లోకేష్ ధ్వజమెత్తారు.

- Advertisement -

ప్రభుత్వ పెద్దల స్కెచ్ ప్రకారమే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. ఒక్కసారి కూడా విచారణకు పిలవకుండా.. ఎమ్మెల్యేను అరెస్టు చేయడంలో ప్రభుత్వ ఉద్దేశ్యం స్పష్టంగా తెలిసిపోతోందని లోకేష్ విమర్శించారు.

అచ్చెన్న అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడంపట్ల ప్రభుత్వంపై బీసీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు.

- Advertisement -