బాలీవుడ్ హీరో సుశాంత్ మృతిపై.. నారా లోకేష్ దిగ్భ్రాంతి!

- Advertisement -

అమరావతి: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హిందీ చిత్రపరిశ్రమ ఓ గొప్ప యువ నటుడిని కోల్పోయిందని, సుశాంత్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని ట్వీట్టర్‌లో తెలిపారు. సుశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెయజేశారు.

- Advertisement -

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌(34).. ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 1986 జనవరి 21న పట్నాలో జన్మించిన సుశాంత్‌ సింగ్‌ పలు టీవీ సీరియళ్లలో నటించారు.

ఆ తర్వాత 2013లో వచ్చిన ‘కై పో చే’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ధోనీ బయోపిక్‌ ‘ఎమ్‌ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో హీరోగా నటించి బాగా పాపులర్ అయ్యారు.

ఈ చిత్రంలో సుశాంత్ నటనకు ప్రముఖుల నుంచి ప్రశంసలందాయి. ‘సుశాంత్ ఫర్‌ ఎడ్యుకేషన్’ తదితర సేవాసంస్థలు నిర్వహిస్తూ సమాజానికి తనవంతు సాయం చేస్తున్నారు.

- Advertisement -