‘నిజమే గంటా అలకబూనారు’: ‘సాక్షి’పై లోకేష్ సెటైర్లు

1:47 pm, Wed, 13 March 19
nara lokesh-gant srinivas

అమరావతి: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ సాక్షి మీడియాను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. భీమిలి టికెట్ విషయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు అధిష్టానంపై అలక బూనారంటూ వస్తున్న వార్తలపై లోకేష్ ట్విట్టర్‌లో తనదైన శైలిలో ఓ సెల్ఫీ పోస్టు చేశారు.

ఆ సెల్ఫీలో గంటాతోపాటు నారా లోకేష్ నవ్వుతూ ఉన్నారు. ‘అవును నిజమే.. గంటా గారి ముఖంలో అలక చూడండి’ అంటూ లోకేష్ సెటైర్లు వేశారు. కాగా, ఆ సెల్ఫీలో సాక్షి టీవీలో గంటా అలక బూనారంటూ వస్తున్న వార్త కూడా వచ్చే విధంగా తీశారు.

జేడీ పోటీ చేస్తారనే ప్రచారంతో…

అంతేగాక, ‘అవినీతి డబ్బా.. అవినీతి పత్రిక’ అని లోకేష్ వ్యాఖ్యానించారు. కాగా, భీమిలి నుంచి టీడీపీ తరపున మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా ఈ విషయంలో అలకబూనారంటూ కొన్ని మీడియాలో వార్తలు రావడంతో లోకేష్ ఈ విధంగా స్పందించారు.

ఇప్పటికైతే గంటా ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనేదానిపై స్పష్టత రాలేదు. ఈ పథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మంత్రి గంటా బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో విశాఖలో అసెంబ్లీ సీట్ల కేటాయింపులపైనే ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో భీమిలి లేదా విశాఖ ఉత్తరం లేదా విశాఖ పార్లమెంటుకు గంటా పోటీ చేస్తారనే ఊహాగానాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

చదవండి: టీడీపీకి బిగ్ షాక్! వైసీపీలోకి వెళ్లేందుకు సిద్దమైన మంత్రి!