వివేకా మరణంలో అసలు ట్విస్ట్ ఇదే! రెండో భార్యే కారణమా?

ys viveka death mistary
- Advertisement -

కడప: ప్రతిపక్ష నేత జగన్ బాబాయ్ , మాజీ ఎంపీ , ఎమ్మెల్యే వై ఎస్ వివేకా చనిపోయి మూడు రోజులు పూర్తికావస్తున్న కూడా ఈ కేసులో ఎటువంటి పురోగతి కనిపించడంలేదు. ఇంతవరకు వివేకా ని ఎందుకు చంపారో పోలీసులు కనిపెట్టలేకపోయారు. వివేకానందరెడ్డి 2010లో ఓ ముస్లిం మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు పెద్దగా తెలియకపోయినా, కడప జిల్లా వాసులకి, సన్నిహితులకు మాత్రం తెలుసు.

పరమేశ్వర్ రెడ్డి పై అనుమానం..

ఆస్తి పంపకాలకు సంబంధించి కొన్నాళ్లుగా వివేకానంద రెడ్డిపై ఒత్తిడి పెరుగుతోందని తెలిసింది. ఎన్నికలకు ముందే ఆస్తుల పంపకాలు జరపాలని నిర్ణయించుకున్న ఆయన… హైదరాబాద్, కడప జిల్లాలో ఆస్తుల్ని ఎవరెవరికి, ఎంతెంత కేటాయించాలనేదానిపై లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. ఐతే, ఈ లెక్కల్లో తేడాలు రావడం వల్లే ఆయన్ను చంపేశారన్నది కొత్త కోణం.

ఇది ఎంతవరకూ నిజమో సిట్ అధికారులు తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఆస్తుల పంపకాల్లో తేడాల వల్లే ఆయన్ను చంపేసి ఉంటే… ఆ చంపినది ఎవరు. మొదటి భార్య కుటుంబ సభ్యులా, రెండో భార్య కుటుంబ సభ్యులా, లేక ఇంకెవరైనా ఉన్నారా అన్నది తేల్చేపనిలో బిజీ అయ్యారు సిట్ అధికారులు.

పులివెందుల దగ్గర్లోని కసనూరుకు చెందిన పరమేశ్వర్ రెడ్డి., భూ సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఆయన వివేకాతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడని తెలిసింది. ఐతే ఈ మధ్య ఓ వివాదంలో పరమేశ్వర్‌కీ, వివేకాకీ మధ్య గొడవ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. వివేకానంద రెడ్డి హత్యకు 10 రోజుల ముందు, త్వరలో ఓ సెన్సేషనల్ న్యూస్ వస్తుందని పరిమేశ్వర్ కొందరితో అన్నట్లు తెలిసింది.

ప్రస్తుతం పరమేశ్వర్, ఆయన కుటుంబం పులివెందులలో కనిపించట్లేదు. దీనితో ఈ హత్య వెనక పరమేశ్వర్ హస్తం ఉందా అన్న సందేహం కూడా మొదలవుతుంది. వీలైనంత త్వరగా ఈ కేసులో అసలు దోషులని పట్టుకొవాలని ప్రయత్నిస్తున్న సిట్ అధికారులకి కొత్త కొత్త ట్విస్టులు షాక్ కి గురిచేస్తున్నాయి.

- Advertisement -