అచ్చెన్నను కలిసేందుకు వీల్లేదన్న అధికారులు.. వెనుదిరిగిన చంద్రబాబు

- Advertisement -

అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు హైదరాబాద్ ‌నుంచి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అధికారులు అడ్డుకున్నారు. 

అచ్చెన్నను చూసేందుకు వీలులేదని అడ్డగించారు. ఆయనను అబ్జర్వేషన్‌లో ఉంచారని, ఇప్పుడు ఎవరూ కలిసేందుకు వీలు లేదని చెప్పి పంపించేశారు.

- Advertisement -

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అయితే ఈ మధ్యనే ఆయన సర్జరీ చేసుకున్న నేపథ్యంలో వైద్య  పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.

అచ్చెన్న అరెస్టు, ఆరోగ్య పరిస్థితిపై కలత చెందిన పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరు ఆస్పత్రికి వెళ్లారు.

అచ్చెన్నను పరామర్శించేందుకు ఉదయాన్నే జైళ్లశాఖ డీజీ.. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు చంద్రబాబు పేషి సిబ్బంది దరఖాస్తు చేశారు.

అయితే అందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. గుంటూరు చేరుకున్న తర్వాత చంద్రబాబుకు అనుమతి నిరాకరణ విషయాన్ని పార్టీ నేతలు, పోలీసు అధికారులు తెలిపారు.

దీంతో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌‌కు ఫోన్ చేసి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

అచ్చెన్నాయుడును పరామర్శించకుండానే చంద్రబాబు వెనుదిరిగి వెళ్లిపోయారు. 

- Advertisement -