విశాఖ సెంట్రల్ జైలులో కలకలం.. ‘కరోనా’తోనే మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్ మృతి!

- Advertisement -

విశాఖపట్నం : మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును హత్య చేసి ఓం ప్రకాశ్‌ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల కన్నుమూశాడు. 

అతడి మృతికి సంబంధించి తాజాగా షాకింగ్ విషయం ఒకటి వెలుగు చూసింది. అతడు కరోనాతోనే మృతి చెందినట్ట తాజాగా నిర్ధారణ అయింది. మృతదేహానికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని రిపోర్టులు వచ్చాయి. 

- Advertisement -

దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు సెంట్రల్ జైలులోని సిబ్బంది, జీవిత ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా,  10 మంది సిబ్బంది, 27 మంది జీవితఖైదీలకు కరోనా సంక్రమించినట్టు తేలింది. 

పాజిటివ్‌గా తేలిన ఖైదీలను వైద్యుల సూచనల మేరకు క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొంతమంది రిమాండ్‌ ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -