జగన్ ప్రచార సభలో అపశృతి: ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

4:52 pm, Wed, 3 April 19
YS Jagan Latest News, Jagan Campaigning News, AP Political News, Newsxpressonline

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభలో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో జగన్‌ ప్రసంగించిన అనంతరం జనరేటర్‌ వద్ద విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ అయింది. కరెంటు తీగలు మీద పడటంతో ఆర్టీసీ కండక్టర్‌ సోమిరెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందారు.

ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం…

ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు కృష్ణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓ బాలుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

మిగిలిన క్షతగాత్రులకు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కూడా రాజకీయ పార్టీల ప్రచారంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రచారం నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయడుతున్నారు.

చదవండి: పవన్ కోసం రంగంలోకి సూర్యకాంతం.. ఉగాది తరువాతే మెగా హీరోస్!