డిసెంబరు 16న కాకినాడలో ’పద్మశాలీ‘ చైతన్య భేరి! రాజకీయ అణచివేతపై గళమెత్తనున్న పద్మశాలీలు…

markandeya-swamy
- Advertisement -

markandeya-swamy

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో డిసెంబరు 16న ’పద్మశాలీ‘ చైతన్యభేరి జరగనుంది. అన్ని రాజకీయ పార్టీలు బీసీల పేరు చెప్పి.. ఆ కోటాలో అన్ని కులాలకి ఎన్నికలలో సీట్లు కేటాయిస్తున్నా.. బీసీల్లో ఒక బలోపేతమైన చేనేత రంగంలో ఉన్న పద్మశాలీలను రాజకీయంగా ఎదగనివ్వకుండా చేస్తున్న విధానంపై పద్మశాలీ ప్రతినిధులు ఈ సభలో తమ గళం వినిపించనున్నారు.

- Advertisement -

ఆలోచిస్తే.. వారు చెబుతున్న దాంట్లోనూ నిజం ఉంది.  పద్మశాలీల ఆవేదనలోనూ ఒక అర్థం ఉంది. ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…

ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఒక్కరంటే ఒక్కరు పద్మశాలీలకు సీట్లు కేటాయించకపోవడం.. నిజంగా వారి రాజకీయ దైన్యస్థితిని తెలియజేస్తోంది.

కారణం ఏమిటని ఎప్పడైనా ఆలోచించారా?..

ఈ దుస్థితి ఎందుకంటే..

అడిగేవాడు లేడు.. ప్రశ్నించే పద్మశాలీలు లేరు…

25 ఎంపీల్లో పద్మశాలకు ఒక్క సీటు లేదు. ఇందులోనే ఇద్దరికి కేటాయించినా అది కూడా.. అత్యధిక శాతం ఉన్న పద్మశాలీలను వెనక్కి నెట్టేయడం.. ఈ వర్గాన్ని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేస్తోంది. అందుకే డిసెంబరు 16న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆనందభారతి గ్రౌండ్‌లో పద్మశాలీ చైతన్య భేరి  కార్యక్రమం రూపుదిద్దుకొంది. మన వాణిని వినిపించేందుకు పద్మశాలీలు తండోపతండాలుగా తరలి రావాలని .. తూర్పుగోదావరి జిల్లా పద్మశాలీ సంఘ అధ్యక్షులు పంపన రామకృష్ణ కోరుతున్నారు.

వ్యవసాయ రంగం తర్వాత అంత పెద్ద చేనేత రంగంలో అత్యధిక సంఖ్యలో ఉన్న పద్మశాలీల రాజకీయ ప్రస్థానమే ప్రారంభం కాలేదు. అందుకే మన బతుకులిలా ఉన్నాయి..

మీకు తెలుసా?

అసలు ప్రజాప్రతినిధిగా ఉంటే ఏం చేయవచ్చో మీకు తెలుసా?

అసలు ఓటు విలువ మీకు తెలుసా?

ఇవి తెలుసుకుంటే..

ఆ రాజకీయ పార్టీలే కాదు… వాటి జేజెమ్మలు కూడా దిగివస్తాయని.. పద్మశాలీ నేతలు పేర్కొంటున్నారు.

ఒక్కసారి వారు చెబుతున్నది కూడా చూడండి..

మన చేతిలో అధికారం ఉంటే…అలా..అలా.. సరదాగా చిటికేస్తూ.. ఏం చేయవచ్చో తెలుసుకోండి..

ఎవరినీ సీఎం దగ్గరకు తీసుకెళ్లండ్రా బాబూ.. అని బతిమాలుకో అక్కర్లేదు.. ఒకవేళ ఎవరూ పట్టించుకోకపోతే.. అసెంబ్లీ సమావేశాల్లో డైరెక్టుగా మన వాణిని మనమే వినిపించుకోవచ్చు..అలా చట్టసభల్లో మనం లేవనెత్తిన సమస్యకు కచ్చితంగా సంబంధిత మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఇది ఇరకాటంగా మారుతుంది. అప్పుడు చచ్చినట్టు పరిష్కారానికి చొరవ తీసుకుంటారు.

లేదూ..కాగితాల్లో తప్పుడు లెక్కలు చూపిస్తే తిరిగి మన దగ్గర ఉన్న అసలు లిస్టు చూపించి నిలదీయవచ్చు.. లేదా రీ సర్వేకు డిమాండ్ చేయవచ్చు.. ఉదాహరణకి రామచంద్రపురం నియోజకవర్గంలో పద్మశాలీల సంఖ్య 2,500గా చూపించారు.

  • అప్పుడు పంపన రామకృష్ణ ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తే.. పద్మశాలీల సంఖ్య  సుమారు 12 వేలకు పైనే ఉన్నట్టు తేలింది. అంటే అధికారులు రాసినవి.. తప్పుడు లెక్కలే కదా.. అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇవే వారి వద్ద ఉంటాయి.. ఆ ప్రకారం చూసి.. రాజకీయంగా ఇన్ని ఓట్లే ఉన్నాయి.. వీరి వల్ల ఉపయోగం లేదని పక్కన పెట్టేస్తున్నారు. మనవాళ్లు ఒక్కసారి అధికారంలోకి వస్తే.. ఈ తప్పుడు లెక్కల వ్యవహారమంతా బయటకు వచ్చేస్తుందని పంపన రామకృష్ణ అంటున్నారు.

ఎన్నికల్లో ఓటు విలువ తెలుసుకోండి.. అంటున్నారు

గత 2014 ఎన్నికల్లో ఎక్కడో కాదు.. తూర్పుగోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఒక దాంట్లో కేవలం 714 ఓట్ల తేడాతో ఒకరు , 1513 ఓట్ల అత్యల్ప ఓట్ల మెజార్టీతో ఒకరు విజయం సాధించారు. దీనిని బట్టి మీకేమి అర్థమవుతుంది.. మీ ఓటు విలువ ఎంతో తెలుసుకోండి.. ఒక్కసారి ఆలోచించండి.. అక్కడ మన పద్మశాలీలు లేరా? మనమంతా ఒక మాట మీద ఉంటే…

ఆ ఓటును..అటూ ఇటూ ఓటేసేస్తే ఏమవుతుంది?

గెలిచేవాడు.. ఓడిపోతాడు.. ఓడేవాడు.. గెలుస్తాడు.. కాదంటారా?

ఒకొక్క సామాజిక వర్గం బల ప్రదర్శనలు చేస్తుంటే.. పద్మశాలీల్లో మౌనంగా ఉంటే..అదే అలుసుగా తీసుకొని..పార్టీలు.. ఎన్నికల్లో సీట్లు కేటాయించకుండా..ఎన్నికల్లో కల్లబొల్లి హామీలిచ్చి పూర్తిగా వాడేసుకుంటున్నాయి. అంతెందుకు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎంపీ స్థానం 3,401 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఒకొక్క అభ్యర్థికి 5లక్షలపైనే ఓట్లు వచ్చాయి. చూశారా.. అన్ని లక్షల ఓట్లలో మనమెంత ? అనుకోవద్దు.. చివరికి వచ్చేసరికి ఆ మూడు వేల ఓట్లే..విజయాన్ని అందించాయి. కాకినాడలో పద్మశాలీలు మూడువేల మంది లేరా?

ఎందుకు లేరు..

రాష్ట్రం మొత్తమ్మదీ అడుగడుగునా ఉన్నారు. అందుకే మీ ఓటు విలువ తెలుసుకోండి.. నాది ఒక్క ఓటే కదా.. అనుకోవద్దు.. మా ఊరిలో 200 మందిమే ఉన్నాం.. లేదా 200 కుటుంబాలే ఉన్నాయని దయచేసి అస్సలు అనుకోవద్దు.. ముందా భావజాలం నుంచి బయటకు రండి..

మనందరం ఒక్కటై కలిస్తే…

రాజకీయపార్టీలే కాుద.. వాటి జేజెమ్మలు కూడా దిగిరావాలి..అని నేతలు ఢంకా భజాయించి చెబుతున్నారు. ముందు రాజకీయపార్టీలకు భయం లేదు.. పద్మశాలీలంటే గౌరవం లేదు.. అది రావాలంటే ఏం చేయాలి..

పద్మశాలీలు సంఘటితం కావాలి..యూనిటీ రావాలి..చైతన్యం రావాలి.. ఉరికే ఉత్సాహం రావాలి.. నడిపించే నాయకులకు కొదవ లేదు…కేవలం కావల్సింది మీలో ఒక చైతన్య స్ఫూర్తి రావాలి.  ముందుండి నడిపించే వారి వెనుకే నడవండి.. వారు చెప్పినట్టు వినండి..అక్కడ తెలంగాణ ఎన్నికల్లో

కేసీఆర్ ఏమన్నాడో తెలుసా? ‘మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. రాళ్లు తీసుకొని కొట్టమన్నాడు..’

ఇక్కడ పద్మశాలీ అనేవాడుంటే.. మీ అందరికి అడగడానికి అధికారం ఉంటుంది. ధైర్యంగా వెళ్లి అడగవచ్చు. ఇప్పుడెవరి దగ్గరకెళతారు.. అదే ప్రశ్న.. అందుకే చట్టసభల్లో పద్మశాలీలకు ప్రాతినిథ్యం కల్పిస్తేనే మేం ఓటేస్తాం.. లేదంటే బాయ్ కట్ చేస్తాం అని చెప్పండి..  సోది కబుర్లు కాదు.. ఆచరణలో చూపించమనండి.. ఇప్పటికే మీలో చైతన్యం రాకపోతే మరో 70 ఏళ్లు అంటే 140 ఏళ్లు వచ్చినా ఇలాగే ఉంటామని నేతలు పేర్కొంటున్నారు.

పద్మశాలీల కష్టాలు తీరవు.. ఆకలి చావులు ఆగవు.. ఒక్కముక్కలో చెప్పాలంటే మనం మారకపోతే.. మన బతుకులు, మన తలరాతలు మారవు..

రండి.. కలిసి రండి.. రేపు డిసెంబరు 16న కాకినాడలో జరగబోయే పద్మశాలీ చైతన్య భేరికి తరలిరండి.. మన బలం ఏమిటో నిరూపిద్దాం.. మన శక్తి ఏమిటో చూపిద్దాం.. ఎన్నాళ్లని ఏడుస్తూ కూర్చుంటాం.. ఎన్నాళ్లని మన బతుకిలింతేనని అనుకుంటాం.. ఎన్నాళ్లని ప్రభుత్వాలు విదిల్చే వాటికి కోసం ఎదురుచూస్తూ కూర్చుంటాం..

మనకి చట్టసభల్లో ప్రాతినిథ్యం కావాలి.. జనాభా ప్రాతిపదికన, ఇన్నాళ్లూ భుజాలు అరిగిపోయేలా వారి పల్లకీలు మోసిన ప్రాతిపదికలనైనా రాష్ట్రం మొత్తమ్మీద 10 నుంచి 12 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ సీట్లు కేటాయించకపోతే.. ఈ రాజకీయ పార్టీలకు జడుపు జ్వరం వచ్చేలా చేద్దాం..

ఈ రాజకీయ చైతన్యం కోసం పోరాడదాం.. అలా జరిగిన రోజున మన పద్మశాలీల ముఖాల్లో అసలైన జీవం వస్తుంది.

మరిన్ని వివరాల కోసం.. తూర్పుగోదావరి జిల్లా పద్మశాలీ సంఘ అధ్యక్షులు పంపన రామకృష్ణను 9553589999 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.

 

- Advertisement -