టీడీపీని గెలిపించుకుందాం.. చేనేతను బతికించుకుందాం: పంపన రామకృష్ణ

5:18 pm, Tue, 2 April 19
chenetha-gramallo-pampana-ramakrishna-intinti-pracharam

కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. చేనేత కులాలకు చేయూత దొరుకుతుందని, అందుకు నిదర్శనం చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయడమేనని జిల్లా బీసీ, పద్మశాలీ సంఘాల అధ్యక్షుడు పంపన రామకృష్ణ పేర్కొంటున్నారు.

ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో మండుటెండల్లో అలుపెరగకుండా తిరుగుతూ.. చేనేత సంఘీయుల ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం చేనేతలకు అందించే పథకాలను వివరిస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో తిరుగుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వస్తే చేనేత కార్పొరేషన్ ద్వారా మనకి ఒక మార్గం దొరుకుతుందని ఆయన వివరిస్తున్నారు.

ఈసారి చేనేత కార్పొరేషన్ వచ్చింది..

ఇన్నాళ్లూ మన బాధలు చెప్పుకోవడానికి, మన సమస్యలు చెప్పుకునే వేదిక లేక అవస్థలు పడ్డాం.. కానీ ఈసారి చేనేత కార్పొరేషన్ వచ్చింది. అమరావతిలో మనకు ఒక ఆఫీసు ఉంటుంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారు. వాళ్ల పని.. రాష్ట్రంలో ఉన్న చేనేత కులాలు, కార్మికులు, పేదవాళ్లు పడుతున్న అవస్థలు వినడమే.

ఆ ప్రకారం మనకు చేయూతనిచ్చేందుకు ఒక రాజమార్గం దొరికింది. మీ సమస్యను సీఎం దగ్గర చెబుతాను. ఆయన ఓకే చేసేస్తారు..లాంటి అబద్ధాలు చెబుతూ, సర్ది చెప్పి పంపించే నాయకులు, మధ్య దళారీలు ఉండరు. ఇక మాయమాటలు చెప్పేవాళ్లుండరు. వాటన్నింటికి బ్రేక్ పడిపోయింది.

అద్భుత అవకాశాన్ని ముఖ్యమంత్రి మనకిచ్చారు…

అందుకే ఈసారి తప్పకుండా మనకు మేలు చేసిన తెలుగుదేశం పార్టీకి ఓటేసి.. మన చిత్తశుద్ధిని చాటుదాం. తద్వారా భవిష్యత్తులో ముఖ్యంగా మన చేనేత కులాలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడే చేనేత కార్పొరేషన్ అంటూ ఒక అడుగు పడింది. అది లక్ష అడుగుల మార్గంగా ఉంది.. అది భవిష్యత్తులో కోటి వెలుగులతో నిండి కళకళలాడుతుంటుంది.

మన కోసం..మన భవిష్యత్తు కోసం.. ఇన్నాళ్లూ వెలుగులోకి రాని మన సామాజిక వర్గం కోసం.. ప్రజాసేవ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని గెలిపించుకుందాం.. మన చేనేతను బతికించుకుందాం..

pampana-on-prachara-radham19 నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరుగుతూ…

ఇలా కాకినాడ రూరల్, పిఠాపురం, అనపర్తి, కోనసీమ, రాజమహేంద్రవరం ఇలా అన్ని నియోజకవర్గాల్లో.. చేనేత కులాల వారు ఉన్న గ్రామాల్లో.. ఇంటింటికి వెళ్లి  ప్రచారం చేస్తున్నారు. చంద్రన్నకు ఓటేస్తే వచ్చే లాభాలను వివరిస్తున్నారు. ముండుటెండల్లో అలుపెరగకుండా తిరుగుతున్నారు.

ఏ నియోజకవర్గం నుంచి ఏ మ్మెల్యే ఎవరు రమ్మని పిలిచినా చాలు.. రెక్కలు కట్టుకొని వాలిపోతున్నారు. యువకుడు కావడం, ప్రజానాయకుడు కావడంతో ఉత్సాహంగా ఉరకలు పెడుతూ పరుగులు తీస్తున్నారు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేసే పంపన రామకృష్ణ లాంటి ప్రజానాయకుడు తోడు ఉండటం.. ఎంతో ధైర్యాన్నిస్తుందని ప్రచారంలో పాల్గొంటున్న నేతలందరూ అంటున్నమాట.

leaders-joining-in-tdp-in-the-presence-of-pampanaకష్టపడి పార్టీ కోసం పనిచేసే ఎందరో ఉన్నతెలుగు దేశం పార్టీకి రామకృష్ణ రావడంతో నేతన్నలందరూ ఉత్సాహంగా తెలుగుదేశంలోకి వచ్చి చేరుతున్నారు. ప్రచారంలో పంపన రామకృష్ణ వెంట చేనేత సంఘీయులు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారు.

వైసీపీ హామీలు ఆచరణ సాధ్యం కానివి…

పదేళ్ల నుంచి అధికారంలో లేని జగన్ పార్టీకి ఓటేస్తే.. వాళ్లు సర్దుకొని నిలదొక్కుకోవడానికి ఐదేళ్లు సరిపోవని పంపన రామకృష్ణ విమర్శించారు. అంతేగాని.. ఆయన చెబుతున్నట్టు నవరత్నాల హామీలు ఆచరణ సాధ్యం కానివని, కల్లబొల్లి మాటలతో మాయలో పడవద్దని హెచ్చరిస్తున్నారు.

చేనేత కార్పొరేషన్ అంటూ ఒక అడుగు పడింది.. దానిని వంద, వేయి, లక్ష, కోటి అడుగుల మార్గంగా మనం మార్చుకోవాలని చివరిగా చెబుతున్నారు.

– శ్రీనివాస్ మిర్తిపాటి