భారత్-పాకిస్తాన్‌ మధ్య యుద్ధంపై స్పందించిన జనసేనాని! పవన్ ఏమన్నారంటే…

2:41 pm, Thu, 28 February 19
Pawan-Kalyan

iaf-mirage-2000-fighter-jet-1, newsxpress.online

కడప: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొని ఉందని పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొచ్చాడు . యుద్ధం జరిగితే ఇరుదేశాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.

యుద్ధం వల్ల ఇద్దరికీ నష్టమే…

ఉగ్రవాదం విచ్చలవిడిగా మారిందన్నారు. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు బలికావడం బాధాకరమని చెప్పారు. మన పైలెట్‌ పాకిస్థాన్‌ సైన్యానికి దొరకడం కలవరపాటుకు గురి చేస్తోందని తెలిపారు.

పాకిస్థాన్ ఆర్మీకి భారత పైలట్ చిక్కడం కలవరానికి గురి చేస్తోందని చెప్పారు. జెనీవా ఒప్పందానికి పాకిస్థాన్ కట్టుబడి ఉండాలని సూచించారు. అభినందన్‌ క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. జెనీవా నిబంధనలను పాకిస్థాన్ పాటించాలని కోరారు

చదవండి: మా అదుపులోనే ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు: పాక్, వీడియో రిలీజ్.. ఒక పైలట్ అదృశ్యమంటూ భారత్