అన్నీ కుదిరితే పవన్ సీఎం అవుతారంటున్న నాగబాబు…

11:34 am, Sat, 11 May 19
nagababu comments on zero money politics

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన 5 సీట్లు మించి గెలవదని చాలా సర్వేలు చెబుతున్నాయి. ప్రజల్లో కూడా అదే చర్చ కూడా నడుస్తోంది. ఎక్కువ శాతం సర్వేలు వైసీపీనే గెలవచ్చని చెబుతుంటే…కొన్ని సర్వేలు టీడీపీ గెలుస్తాయని చెబుతున్నాయి.

అయితే జనసేన నేతలు మాత్రం,….తమ పార్టీ మాత్రం ఊచించని ఫలితాలు సొంతం చేసుకుంటుందని, ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై పవన్ సోదరుడు, జనసేన నరసాపురం అభ్యర్ధి నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

చదవండి: వైసీపీలోకి ఎంపీ రాయపాటి సోదరుడు?

జనసేన కింగ్ మేకర్ అయితే…

తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్‌ను సీఎం కానివ్వను అని పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై నాగబాబు మాట్లాడుతూ..‘కల్యాణ్ బాబు జగన్‌ను సీఎం కానివ్వడు. చంద్రబాబునూ సీఎం కానివ్వడు’ అని తేల్చిచెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే పవన్ కల్యాణే సీఎం అవుతాడేమో అని వ్యాఖ్యానించారు. జనసేన కింగ్ మేకర్‌గా మారితే ఎవరికి మద్దతు ఇవ్వాలో పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

అయితే తమకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కానీ, వైసీపీ అధినేత జగన్‌తో కాని ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. ఇక జనసేనలో టికెట్లను అమ్ముకున్నారన్న ప్రచారం కేవలం మీడియా సృష్టి మాత్రమేనని, తాము ఎవ్వరికీ టికెట్లు అమ్ముకోలేదని చెప్పారు.

చదవండి: అక్కడ క్రాస్ ఓటింగ్ ఎవరి కొంపముంచుతుందో?