తెలంగాణలో 23 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీచేద్దామని అనుకున్నాం కానీ.. : పవన్ కామెంట్స్

janasena chief pawan kalyan clarify on contest in telangana electio
- Advertisement -

pawan-in-dwakra-meeting

విజయవాడ: తెలంగాణలో వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం విజయవాడ పర్యటనలో స్పందించారు.

- Advertisement -

గతంలో జనసేన పార్టీ తెలంగాణ, ఆంధ్ర‌ప్రదేశ్  రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే అయితే.. ఆ తర్వాత ఆయన తన దృష్టి అంతా ఆంధ్రపైనే పెట్టారు. తాజాగా  తెలంగాణలో పోటీ చేసే విషయంపై పవన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై రెండు మూడు రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

ముందస్తు ఎన్నికలు రావడంతో…

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం, తను ఈ విషయంలో సన్నద్ధంగా లేకపోవడం వల్ల అక్కడ పోటీ చేసే అంశంపై సమాలోచనలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు.  ముందస్తు ఎన్నికలు  కాకుండా వచ్చే 2019లో ఎన్నికలు గనుక వచ్చి ఉంటే.. జనసేన పార్టీ  23 స్థానాల్లో పోటీ చేయడంతోపాటు మూడు పార్లమెంట్ స్థానాల్లోనూ పోటీచేయాలని భావించామని వివరించారు.

కానీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో.. తనకు సందిగ్ధత ఏర్పడిందని పవన్ అన్నారు. అయితే.. తాము స్వతంత్రంగా పోటీ చేస్తామని, తమకి  మద్దతు ఇవ్వాలని చాలామంది తనను కోరుతున్నారని, కాబట్టి ఈ విషయాలపై చర్చించి రెండు మూడు రోజుల్లో తమ పార్టీ తుది నిర్ణయం ఏమిటనేది ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

- Advertisement -