‘బ్రతికుండగా చూడలేకపోయా… నా అంత్యక్రియలకైనా పవన్ రావాలి..’: ఓ వీరాభిమాని చివరి కోరిక!

pawan-kalyan-fan-suicide
- Advertisement -

pawan-kalyan-fan-suicide

విజయవాడ: జనసేన కార్యకర్త, పవన్ కల్యాణ్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన కొమరవెల్లి అనిల్‌ కుమార్‌ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. నగరంలోని తల్‌వాకర్స్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. గతంలో జనసేన నిర్వహించిన ఎన్నో కార్యక్రమాల్లో కార్యకర్తగా అనిల్ కుమార్ సేవలందించాడు.

- Advertisement -

తన ఆరాధ్య హీరో పవన్ కళ్యాణ్‌ను కలుసుకోవాలని ఎన్నోమార్లు యత్నించి కలుసుకోలేకపోయాడు అనిల్.  దీంతో అతడు కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఇంట్లో ఎవరూ సమయంలో అనిల్ కుమార్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. అయితే చనిపోయే ముందు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఓ లేఖ రాసిన అనిల్ కుమార్, తన మరణాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని కోరాడు.

బతికుండగా ఆయనను కలుసుకోలేక పోయాయనని.. తాను చనిపోయిన తర్వాతైనా తనను చూడటానికి తన అభిమాన నటుడు పవన్‌ కల్యాణ్‌  రావాలని ఆ లేఖలో అతడు కోరాడు. అలాగే తన అంత్యక్రియలు పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా జరగాలని కూడా అనిల్ కుమార్ ఆకాంక్షించాడు. పవన్ తప్పకుండా వస్తారనే విశ్వాసాన్ని అతడు ఆ లేఖలో వ్యక్తం చేశాడు.

అనిల్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మితి మీరిన అభిమానం ప్రాణాలు తీసిందంటూ అనిల్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన విజయవాడలో తీవ్ర విషాదాన్ని నింపింది.

 

 

- Advertisement -