దేవుడిచ్చిన వరాన్ని జగన్ సద్వినియోగం చేసుకోవాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan Latest Updates, AP Political News, Janasena Latest news, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రెండో ఇంటర్వ్యూలో ఈసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు. జగన్ యేడాది పాలనపై సునిశిత విమర్శలు చేశారు.

మూడు రాజధానులను మొదటి పార్ట్ లో టార్గెట్ చేస్తే, ఈసారి జగన్ పాలనను ప్రస్తావిస్తూ.. పార్ట్ 2 వీడియో విడుదల చేశారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి 151 సీట్లు రావడం వైసీపీకి దేవుడిచ్చిన వరమని దానిని జగన్ సద్వినియోగం చేసుకోవడం లేదని పవన్ అన్నారు.

దాదాపు 60 కేసుల్లో హైకోర్టులో ప్రభుత్వం ఓడిపోవడంపై ఆత్మపరిశీలన చేసుకుని తప్పులు సరిదిద్దు కోవాలని సూచించారు. 

ఆదాయం పెంచే మార్గాలు వెతకాలి తప్ప, అప్పులు పెంచే మార్గాలు పెంచుకోవడం సరికాదని ఆర్థిక మంత్రిని ఉద్దేశించి విమర్శించారు.

అప్పులు తెచ్చి ప్రజలకిచ్చే పరిస్థితిని అభివృద్ధి అనలేమని, ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.  

వైసీపీ నాయకులు న్యాయవాదులను దూషించడం సరికాదని, పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. 

అమెరికాలో ఇదే జరిగిందని గుర్తు చేశారు. రాజమండ్రిలో జరిగిన శిరోముండనం, డాక్టర్ సుధాకర్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యల గురించి కూడా స్పందించారు. పవన్ కల్యాణ్ పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడొచ్చు.

- Advertisement -