ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం

- Advertisement -

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఈనెల 1న 1088.. 108,104 అంబులెన్స్‌ సర్వీసులను జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ విషయమై జగన్‌ను పవన్ అభినందిస్తూ ట్వీట్ చేశారు.

‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లను అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం. గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలోనూ ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు కూడా అభినందనీయం.’ అని పవన్ ట్వీట్ చేశారు.

- Advertisement -

అంతకుముందు, ఈ ఉదయం గల్వాన్‌ లోయలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీని అభినందిస్తూ పవన్ ట్వీట్ చేశారు. ‘ పీఎం నరేంద్ర మోదీజీ.. నాయకత్వం అనేది దేశస్థులను ఉత్తేజపరిచేది.

మన సాయుధ దళాల శౌర్యానికి ఘనమైన నివాళులు అర్పించారు, ఈ రోజు లేహ్‌లో వారితో సంభాషించారు. ఇది మన దళాల మనోధైర్యాన్ని పెంచుతుంది. మీరిచ్చిన ఉత్తేజం వారిలో ఉన్న జోష్‌ను ఆకాశాన్ని తాకేలా చేసింది’ అంటూ పవన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -