బాబుకి పవన్ రిటర్న్ గిఫ్ట్! షాక్ లో తెలుగు తమ్ముళ్లు!

11:27 am, Wed, 17 April 19
Pawan Kalyan Latest News, Chandrababu News, AP Political News, Newsxpressonline

అమరావతి: ఒక ప్రముఖ మీడియా సంస్థ ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన సర్వే ప్రకారం పవన్ కింగ్ మేకర్ కాకపోయినా అతడి ‘జనసేన’ వల్ల తెలుగుదేశం పార్టీకి రిటర్న్ గిఫ్ట్ రాబోతోంది అని వెల్లడైన అంచనా రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

2014 ఎన్నికలలో పవన్ సపోర్ట్ వల్ల తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు పవన్ ‘జనసేన’ ఒంటరిగా పోటీ చేయడంతో పవన్ చాల చోట్ల చీల్చిన ఓట్లు తెలుగుదేశం సానుభూతి ఓట్లు మాత్రమే అంటూ ఆ మీడియా సంస్థ తన విశ్లేషణలో పేర్కొంది.

ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలలో ‘జనసేన’ కు 5 శాతం నుండి 15 శాతం వరకు ఓట్లు పడినట్లుగా తన సర్వేలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇలా పవన్ చీల్చిన ఓట్ల వల్ల తెలుగుదేశం విజయం సాధించవలసిన సుమారు 25 అసెంబ్లీ స్థానాలలో ఓటమిపాలు అవుతోందనీ ఆమీడియా సంస్థ తన విశ్లేషణలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో ఈ ఎన్నికలలో పవన్ కింగ్ మేకర్ కాకపోయినా మరో పార్టీ ఓడిపోవడానికి పవన్ ఇమేజ్ సహకరించింద అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా ‘జనసేన’ పార్టీకి సంబంధించి ఐటి విభాగానికి చెందిన కొన్ని ఆఫీసులను ఆంధ్రా ప్రాంతంలో ‘జనసేన’ పార్టీ వర్గాలు మూసివేస్తున్నట్లు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రచురించింది.

ఈ కథనం బట్టి ఎన్నికల ఫలితాలు ముందుగానే పవన్ కు తెలిసిపోయాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికితోడు పవన్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా రెస్ట్ తీసుకుంటున్న నేపధ్యంలో పవన్ కు తాను ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ముందుగానే తెలిసిపోయిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

చదవండి:  మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం!