పార్టీ శ్రేణులతో పవన్ కల్యాణ్ టెలీకాన్ఫరెన్స్.. ఏం చర్చించారంటే?

- Advertisement -

అమరావతి: రాష్ట్రంలో ఉన్న పలుసమస్యల విషయంలో ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ

మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రతినిధులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో చర్చించారు. కరోనా కష్టాలు, పేదలకు ఇళ్ల కేటాయింపు, రేషన్ డీలర్ల ఆందోళన, అమరావతి ఉద్యమం తదితర

- Advertisement -

అంశాలపై పవన్ ప్రధానంగా మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. అయితే ఈ ఉపద్రవాన్ని నియంత్రించే స్థాయిలో ప్రభుత్వ చర్యలు లేవు అనేది

అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న మాట అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

‘కరోనా టెస్టుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ వాటి ఫలితాలు వెల్లడించడంలో జాప్యం గురించి ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే

హాస్పిటల్స్‌లో మౌలిక వసతుల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఆక్సిజన్ కొరత ఉందని వైద్య వర్గాలు వాపోతున్నాయి. వెంటిలేటర్లు, బెడ్స్ సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై దృష్టిపెట్టాల్సిందిపోయి..

ఇది సాధారణ జ్వరం అంటే ఎలా?’ అని ప్రశ్నించారు.

- Advertisement -