చంద్రబాబు ఎఫెక్ట్: పవన్‌కు పోలీసులు ‘నో’, శ్రీకాకుళం పర్యటన రద్దు

2:50 pm, Sat, 30 March 19
Chandrababu Latest news, Srikakulam Latest News, Janasena News, Newsxpressonline

శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం శ్రీకాకుళంలో పర్యటించాల్సి ఉంది. అయితే, శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కూడా ఈరోజే ఉంది. భద్రతా చర్యల్లో భాగంగా పవన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేమని శ్రీకాకుళం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.

శ్రీకాకుళానికి హెలికాఫ్టర్‌లో లేదా రోడ్డు మార్గంలో పవన్ వెళ్లేందుకు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది. పవన్ పర్యటన వాయిదాపై జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జనసేన నేతల ఆగ్రహం…

సీఎం పర్యటన ఉంటే తమ నాయకుడి టూర్‌కు అనుమతివ్వకపోవడమేంటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఇచ్ఛాపురం, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. కాగా, రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడితే ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో పవన్ కళ్యాణ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.