అమరావతి: వైసీపీ సీనియర్ నేత, దివంగత పెనుమత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ సూర్యనారాయణ రాజు (సురేశ్‌బాబు) ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో సురేష్‌బాబు ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
సురేష్‌బాబు పూర్తి పేరు పెనుమత్స వీర వెంకట సూర్యనారాయణరాజు. 6 జులై 1966లో జన్మించారు. బీడీఎస్ (డెంటల్) చదివి, డెంటిస్ట్‌గా పనిచేస్తున్నారు.
గతంలో ఎంపీటీసీ (మెయిద గ్రామం)గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెంటల్ కౌన్సిల్ మెంబర్‌గా, ఇండియన్ డెంటిస్ట్స్ ప్రెసిడెంట్‌గా, వైసీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్తగా, ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు.