ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు కారు డ్రైవర్‌కు కరోనా.. హోం క్వారంటైన్‌లోకి ఎమ్మెల్యే

- Advertisement -

కడప: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన కారు డ్రైవర్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా సోకిన ఆయన డ్రైవర్‌ను కడపలోని ఫాతిమా కొవిడ్ ఆసుపత్రికి తరలించారు.

పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండడం, డ్రైవర్‌కకు వైరస్ సోకిన నేపథ్యంలో ఎమ్మెల్యే రెండు వారాలపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పిలుపునిచ్చారు.

- Advertisement -
- Advertisement -