ధైర్యం ఉంటే ఫలితాలను అంగీకరించాలి! బాబుకు పురంధేశ్వరి చురకలు…

6:24 am, Mon, 15 April 19
purandeswari sensetiopnal comments on chandrababu

ఆంధప్రదేశ్: ఏపీ అసెంబ్లీకి ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న జరిగిన పోలింగ్‌లో చర్చనీయాంశంగా మారిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల అంశం ఢిల్లీకి చేరిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబునాయుడు ఈవీఎంల విషయంలో జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టి పోరాడుతున్నారు.

ఈ క్రమంలో ఆయనపై ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా, ఆయన మరదలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. ఎన్నికలు, పోలింగ్ అంశాలకు సంబంధించి ఈసీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని ఆమె హితవు పలికారు.

ఓటమి భయంతోనే విమర్శలు…

ఓటమి భయంతో ఇతరులను విమర్శించడం సర్వసాధారణం అని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ధైర్యం ఉంటే ఫలితాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించాలని ఆమె చంద్రబాబుకు సూచించారు.

ఓటమి అంచుల్లో ఉన్నవాళ్లే ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతూ.. ఇతరులపై ఆరోపణలు చేస్తుంటారని పురంధేశ్వరి ఎత్తిపొడిచారు. ఎవరైనాగానీ ప్రజాతీర్పును, ఎన్నికల ఫలితాన్ని హుందాగా అంగీకరించాలంటూ చురకలంటించారు.

చదవండి: ఏపీలో అలజడి సృష్టిస్తున్న కొత్త సర్వే! ఐవీఆర్ఎస్ విధానంలో…