జగన్ మంత్రివర్గంలో రెడ్డి సామాజికవర్గం వారే ఎక్కువ ఉంటారట…!

YS Jagan Latest News, AP Cabinet News, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత నెల 30న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి జగన్…శాఖలు వారీగా అధికారులుతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఆయన…తన మంత్రివర్గం ఏర్పాటు చేయడంలో కూడా దృష్టి పెట్టారు. ఈ నెల 8నకొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 25 మందితో జగన్ కేబినెట్ ఉండబోతుందని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలో జగన్ ఫిక్స్ అయ్యారని సమాచారం. ఇక ఇందులో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే జగన్… రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏడుగురికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. వీరిదే కేబినెట్‌లో ఎక్కువ సంఖ్య.

అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి ఆరుగురికి, కాపు, కమ్మ, ఎస్సీ మాల వర్గాల నుంచి ఇద్దరేసి చొప్పున, ఎస్సీ మాదిగ, ఎస్టీ, క్షత్రియ, ముస్లిం, మైనారిటీ, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కనుందని సమాచారం.

చదవండి: ఏపీ స్పీకర్ పదవి రేసులో నలుగురు ఎమ్మెల్యేలు….!
- Advertisement -