ఏపీలో రేపే రీపోలింగ్.. పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

12:59 pm, Sun, 5 May 19

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగిసింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఒక్కో కేంద్రం వద్ద రిటర్నింగ్‌ అధికారి, డీఎస్పీ స్థాయి అధికారి, ప్రత్యేక కేంద్ర పరిశీలకుడిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

నరసరావునపేట నియోజకవర్గ పరిధిలోని కేసానుపల్లి, గుంటూరు పశ్చిమలోని నల్లచెరువు, కోవూరు నియోజకవర్గం పరిధిలో పల్లెపాలెంలోని ఇసుకపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్ప, యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో కలనూతలపాడులో రీ- పోలింగ్‌ నిర్వహించనున్నారు.