ఆగస్టులో అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు పంపిణీ..!

agri-gold
- Advertisement -

అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు స్వాంతన కలిగించడానికి అవసరమైన అన్నిచర్యలూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. దీనికి అవసరమైన కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేయడానికి అధికారులు ఉపక్రమిస్తున్నారు. దీంతో అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవడంతో సీఐడీ అధికారులు డిపాజిటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఏ విభాగంలో ఎంత మంది ఉన్నారు, వారిలో డేటా మ్యాచ్‌ అయిన వారెందరు, కాని వారి సంఖ్య ఎంత, ఎవరెవరికి ఎంత ఇస్తే ఎంతమందికి న్యాయం జరుగుతుంది… వంటి వివరాలతో జాబితాను సీఐడీ అధికారులు సిద్ధం చేశారు.

రూ.20వేలు లోపు డిపాజిట్‌ చేసిన వారికి ఆగస్టులో క్లియర్‌ చేసే ఆలోచనలో జగన్‌ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీనికోసం అవసరమైన రూ.1,429కోట్లలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,150కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది.

గత ప్రభుత్వం కేటాయించిన 250 కోట్లు, అగ్రిగోల్డ్‌ సంస్థకు సంబంధించిన కొన్ని ఆస్తులను అమ్మగా వచ్చిన నిధులను కలుపుకొని, ఈ డిపాజిటర్లకు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.

ఈ మేరకు సీఐడీ అధికారులు తన జాబితాను హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌ ద్వారా ప్రభుత్వానికి అందజేశారు. దానిని పరిశీలన కోసం జిల్లాల్లోని న్యాయ కమిటీలకు పంపి ఆ తర్వాత హైకోర్టు అనుమతితో డబ్బులు పంపిణీ చేయబోతున్నారు

- Advertisement -