చంద్రబాబు బుద్ధి ఎలాంటిదో తెలిసిపోతోంది.. సజ్జల ఫైర్

- Advertisement -

అమరావతి: టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

వైజాగ్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించే విషయంలో చంద్రబాబు నాటకాలన్నీ బయటపడ్డాయని ఆరోపించారు.వైజాగ్ వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకుంటున్నానని,

- Advertisement -

ప్రత్యేక విమానంలో పరామర్శకు వెళుతున్నానని చంద్రబాబు చాలా హడావుడి చేశారని సజ్జల చెప్పారు.చివరికి ఆ విమానం ఏమైందో కూడా తెలియలేదంటూ ఎద్దేవా చేశారు.

తాను వైజాగ్ వెళ్తానంటే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం విమానాలు రద్దు చేసిందంటూ రాష్ట్ర ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా చంద్రబాబు అభాండాలు వేశారని ధ్వజమెత్తారు.

ఆ రోజు ఉండవల్లి కరకట్టలోని తన నివాసానికి వచ్చిన చంద్రబాబు.. వైజాగ్ వెళ్లలేదని సజ్జల ఆరోపించారు. అయితే, అవినీతి కేసులో అచ్చెన్నాయుడు అరెస్టయిన విషయం తెలియగానే

వెంటనే గుంటూరులో ప్రత్యక్షమయ్యారని విమర్శించారు. ఇదే ఆదుర్దా వైజాగ్ గ్యాస్ బాధితుల విషయంలో ఎందుకు కనబడలేదని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు బుద్ధి ఎలాంటిదో అందరికీ తెలిసిపోతుందని పేర్కొన్నారు.

- Advertisement -