లోకేష్‌పై పోటీకి సై అంటోన్న జూనియర్ ఎన్టీఆర్ మామ! జగన్ ఏమంటారో…

3:20 pm, Thu, 14 March 19
Says the competition for Lokesh NTR uncle, Newsxpressonline

హైదరాబాద్: ఏపీలో రాజకీయం గంట గంటకి మారిపోతోంది. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు దూకుడు పెంచారు. ఇటీవలే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో చేరిక తన వ్యక్తిగత నిర్ణయమని, దీంతో తారక్‌కు సంబంధం లేదని చెప్పారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే మంగళగిరి నుంచి నారా లోకేష్‌‌పై పోటీ చేసి గెలుస్తానంటూ శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.

‘‘చంద్రబాబు, జగన్‌కు మధ్య చాలా తేడా…’’

చంద్రబాబును తాను దగ్గర నుంచి చూశానని నార్నె శ్రీనివాసరావు చెప్పారు. చంద్రబాబుకు, జగన్‌కు మధ్య చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని, ప్రజల కోసం వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారని అన్నారు. అందుకే తాను జగన్‌కు మద్దతిస్తున్నానని చెప్పారు.

అంతేకాదు, హైదరాబాదును చంద్రబాబు ఒక్కడే అభివృద్ధి చేయలేదని.. గతంలో ఎంతో మంది సీఎంలు అభివృద్ధి చేశారని  జూనియర్ ఎన్టీఆర్ మామ వ్యాఖ్యానించారు. మరి వైసీపీ అధినేత ఏం నిర్ణయం తీసుకుంటారు? లోకేష్‌పై శ్రీనివాసరావునును పోటీగా నిలబెడతారా? అనే విషయమై అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.