సెప్టెంబరు 5 నుంచి ఏపీలో బడులు పునఃప్రారంభం: ముఖ్యమంత్రి జగన్

- Advertisement -

అమరావతి: కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా మూతపడిన పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి ఉంది. అన్‌లాక్-3లో పాఠశాలలకు అనుమతి లేనట్టు తెలుస్తోంది.

అయితే, ఆంధ్రప్రదేశ్ మాత్రం సెప్టెంబరు నుంచి పాఠశాలలు పునఃప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

- Advertisement -

సెప్టెంబర్ 5వ తేదీన పాఠశాలలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి జగన్ నేడు పేర్కొన్నారు. ఆగస్ట్ 31వ తేదీ నాటికి అన్ని పాఠశాలల్లో నాడు-నేడు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈరోజు అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు-నేడు పనులపై ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఆగస్టు 15వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు.

- Advertisement -