విశాఖలో వరుస దారుణాలు.. యువతిపై బాలుర సామూహిక అత్యాచారం

11:44 am, Thu, 31 October 19

విశాఖపట్టణం: నగరంలో ఒకేరోజు మూడు దారుణాలు వెలుగుచూశాయి. ఓ చోట కన్నకూతురినే తండ్రి వ్యభిచారంలోకి దించితే, మరోచోట స్నేహితులు ఆ పని చేశారు. ఇంకోచోట ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. భీమిలిలో కన్నకూతురినే ఓ తండ్రి వ్యభిచారంలో దింపాడు.

మద్యానికి బానిసైన శ్రీనివాసరావు అనే వ్యక్తి.. డబ్బుల కోసం కూతురితో వ్యభిచారం చేయించాడు. అయితే.. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లి… పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు… తండ్రిని అరెస్ట్ చేశారు. బాలిక ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.

విశాఖలోనే మరో యువతిపై సామూహిక జరిగింది. కైలాసగిరిలో నలుగురు వ్యక్తులు ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పర్యాటక ప్రాంతంతో తమ కామవాంఛ తీర్చుకున్నారు. అయితే… బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు… నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.

కంచరపాలెంలోని కస్తూరినగర్‌లోనూ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే.. భీమిలిలో కన్నతండ్రి ఆ దారుణానికి ఒడిగడితే.. ఇక్కడ ఓ యువతిని స్నేహితులు వ్యభిచార రొంపిలోకి దించారు. పింకీరాణి అలియాస్ జ్యోతి, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ చందు.. ఓ యువతికి మాయమాటలు చెప్పి అరకు తీసుకువెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో ఆమెను కత్తితో బెదిరించి ఓ యువకుడితో అత్యాచారం చేయించారు. ఆ తర్వాత కూడా బలవంతంగా వ్యభిచారం చేయించారు.

అయితే ఆ యువతి ప్రెగ్నెంట్‌ కావడంతో కేజీహెచ్‌లో చేరింది. అక్కడి వైద్యులు నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.