ఆడా మగా తేడా లేదు.. వీడు దరిద్రుడు కాదా?: ‘టీడిపీ నేత’పై షర్మిల ఘాటు విమర్శలు…

- Advertisement -

పశ్చిమగోదావరి: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆడా మగా తేడా లేదు ఒక రౌడీ అంటూ చింతమనేనిపై విమర్శలు గుప్పించారు. ఆమె దెందులూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలతో బుధవారం సమావేశమయ్యారు.

ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకెళ్లాడు.. దరిద్రుడు కదా వీడు.. అని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చింతమనేనికి టీడీపీ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు.

చింతమనేని, బాబుకు గట్టిగా బుద్ధి చెప్పండి..

రౌడీ షీట్లు ఉన్న చింతమనేనికి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు షర్మిల. చింతమనేనిపై 38 రౌడీషీట్లు ఉన్నాయట.. మన ప్రభుత్వం వచ్చాక అవన్నీ బయటకు తీద్దాం అని ఆమె చెప్పారు. మీరు ఓడించండి.. ఆయనకు బుద్ధి వచ్చేట్టు మేం చూస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు.

యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా చంద్రబాబు ఉన్నాడు కాబట్టే.. చింతమనేని ఇలా ఉన్నారని షర్మిల విమర్శించారు. జగన్ వచ్చాక అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని అన్నారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చేలా చూస్తామని చెప్పారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే ప్రజలందరికీ మేలు జరుగుతుందని షర్మిల అన్నారు.

చదవండి: 350 డమ్మీ ఈవీఎంల కలకలం: హైదరాబాద్-విశాఖకు, వైసీపీ నేతవేనా?
- Advertisement -