జగన్‌పై దాడి చేసిన శ్రీనివాసరావుకు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి అత్యంత విషమం!

5:51 pm, Tue, 23 April 19
YS jagan Latest News, Srinivas rao Latest News, Newsxpressonline

అమరావతి: విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు అస్వస్తతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావును రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

అయితే, ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. నిన్న రాత్రి పది గంటల తర్వాత ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అతని ఆరోగ్య పరిస్థితి గురించి పోలీసులు కానీ, వైద్యం అందిస్తున్న డాక్టర్లు కానీ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడం లేదు. ఈ సాయంత్రానికి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోతే, అతన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

రాజమండ్రి సెంట్రలో జైల్లో ఖైదీల కోసం ఆసుపత్రి ఉంది. సాధారణ రోగాలకు అక్కడే వైద్యం అందిస్తుంటారు. సీరియస్ ఉన్న ఖైదీలను మాత్రమే జిల్లా ఆసుపత్రికి తరలిస్తారు.

చదవండి:  కార్యకర్తలని మభ్యపెట్టడానికే సమీక్షలు! చంద్రబాబుపై వైసీపీ నేత ఘాటు వ్యాఖ్యలు!