వైఎస్ జగన్‌పై భారీ కుట్ర! బయటపడిన నిఘా వ్యవస్థ…

5:31 pm, Wed, 3 April 19
YS Jagan mohan Reddy News, AP Political News, Surveillance system News, Newsxpressonline

అమరావతి:  ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎలాగైనా ఎన్నికల్లో ఓడించాలని ప్రత్యర్ధులు చేయని ప్రయత్నం అంటూ లేదు. తాడేపల్లిలో వెఎస్ జగన్ ఇటీవల గృహ ప్రవేశం చేసిన తర్వాత అక్కడ నివాసం ఉండకుండా తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవడంపై పెద్ద చర్చే జరిగింది.

ఎన్నికల సమయంలో ఆయన అలా అర్థాంతరంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇప్పుడిపుడే కారణాలు బయటకు వస్తున్నాయి.  జగన్ ఇంటి నిర్మాణం పూర్తి అవుతున్నదశలోనే.. ఆయన ఇంటి చుట్టూ కిలోమీటర్ పరిధిలో నాలుగు హై పవర్ ఫోన్ ఇంటర్ సెప్టార్లు పనిచేస్తున్నట్టు గుర్తించారు.

ఈ ఇంటర్ సెప్టార్ల ద్వారా పార్టీ కార్యాలయం, అలాగే జగన్ నివాసానికి వచ్చే ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ అన్నిటిని వినొచ్చు, రికార్డు చేయొచ్చు.  వైఎస్సార్సీపీ అభిమానులైన కొందరు సాంకేతిక నిపుణులు వీటిని గుర్తించి, కొత్తగా కట్టుకున్న నివాసం నుంచి ఎలాంటి కార్యకలాపాలు సాగించొద్దని సూచించారట. దీంతో వైఎస్ జగన్ తిరిగి హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి కార్యకలాపాలు సాగించాల్సి వచ్చింది.  

ఇంటర్ సెప్టార్లను ఎలా గుర్తించొచ్చంటే…

ఇయర్ ఫోన్ సాకెట్ నుంచి లౌడ్ స్పీకర్లకు కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ పరికరమేదో నియంత్రిస్తున్నట్టు జుయ్ మనే డిస్ట్రబెన్స్ సౌండ్ వినిపిస్తుంది. ఫోన్ వాడకున్నా కూడా దానికదే స్క్రీన్ లైట్ వెలుగుతుంది. బ్యాటరీ తొందరగా డౌన్ అవుతుంది. ఫోన్ వేడెక్కుతుంది. రిసీవింగ్ కాల్స్ స్పష్టంగా వినిపించవు.

ఇవి కాకుండా.. యాంటీ సర్వైలెన్స్ పరికరాల ద్వారా కూడా ఈ  ఇంటర్ సెప్టర్లను కచ్చితంగా గుర్తించవచ్చు. అవి ఎంత దూరంలో ఉన్నాయి. ఒక దగ్గర నిలకడగా ఉన్నాయా? లేదంటే అవి వాహనాల్లో ఉంచిన మొబైల్ పరికరాలా? అన్నది సైతం తెలుసుకోవచ్చు.

ఇంటర్ సెప్టార్ ఆపరేషన్లు ఎలా ఉంటాయంటే.. సబ్జెక్ట్ ఎటు వెళ్తే అటు అనుసరిస్తాయి. రూట్ మ్యాప్ ముందే తెలుసుకొని 10-20 కిలోమీటర్లకు ఒక మొబైల్ ఇంటర్ సెప్టార్‌ను సిద్ధంగా ఉంచుతారు. జిఎస్ఎం, 3జి, 4జి ఫోన్లకు ప్రత్యేక మాడ్యూల్స్ ఉంటాయి.

టెక్నాలజీ ముఖ్యమంత్రిని అని చెప్పునే వాళ్ళ పనితనం చూశారుగా. నీడను కూడా నమ్మని జనాలు ప్రతిపక్ష నాయకుడిపై ఈ స్థాయిలో కుట్ర పన్నారు మరి.

చదవండి:  వైసీపీ గెలుపు తథ్యం! కారణం ఇదే, తెలుగు తమ్ముళ్ల గుండెల్లో గుబులు!