ఆపరేషన్ ‘బి’ (బాబు): వచ్చే 15 రోజుల్లో.. 30 మంది టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ దాడులు: తమ్మారెడ్డి జోస్యం

tammareddy bharadwaja
- Advertisement -

tammareddy bharadwaja

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత… ఆ పార్టీ ఏపీపై మరింత తీవ్ర స్థాయిలో దాడికి తెగబడబోతోందనే వార్తలు తనకు తెలిశాయని ఆయన తెలిపారు.

- Advertisement -

వచ్చే 15 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలపై.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఇన్‌కమ్ ట్యాక్స్(ఐటీ) దాడులు జరగబోతున్నట్టు తన వద్ద సమాచారం ఉందని అయన పేర్కొన్నారు.

ఇప్పటికే సీఎం రమేష్‌పై ఈ రకమైన దాడులు జరిగాయని… అందువల్ల అతడిపై మళ్లీ పెద్దగా దాడులు జరిగే అవకాశం లేదని, అయితే సీఎం రమేష్‌ను వదలరని, ఏదో ఒకటి చేసి దెబ్బతీస్తారని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

అలాగే ఏపీ, తెలంగాణలో టీడీపీకి మద్దతుగా ఉన్న పారిశ్రామికవేత్తలపై దాడులు జరుగుతాయని… ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తారని,  వచ్చే ఎన్నికల్లో వీరంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితులను తీసుకొస్తారంటూ ఆయన వివరించారు.

ప్రతి రాష్ట్రంలోనూ ఇదే విధంగా…

ఇది ఒక్క ఆంధ్రలో మాత్రమే జరగడం లేదని… ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ ఇదే విధంగా పథకం వేస్తోందని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని దారుణాలు జరిగినా పట్టించుకోవడం లేదని. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కుట్రలకు తెగబడుతున్నారని భరద్వాజ మండిపడ్డారు. కేరళ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే శబరిమల అంశాన్ని బీజేపీ వివాదాస్పదం చేస్తోందని కూడా ఆయన పెర్కొన్నారు.

పీఎంఓలో ఒక కీలక అధికారి పర్యవేక్షణలో…

ప్రధాని కార్యాలయంలో ఉన్న ఒక కీలక అధికారి ఈ దాడులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ ఈడీ, ఐటీ దాడులు రేపట్నుంచి 15 రోజుల్లోగా జరగవచ్చని చెప్పారు. విజయవాడలో ఉన్నఇద్దరు హోటల్ యజమానులు, విజయవాడ దగ్గరలో ఉన్న పెద్ద యూనివర్శిటీ యజమాని  కూడా ఈ దాడులను ఎదుర్కోబోయే వారి జాబితాలో ఉన్నారని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.

గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న కీలక తెలుగుదేశం నేతలు, బయో ఫర్టిలైజర్స్ బిజినెస్‌లో ఉన్న ఓ నేత, మైనింగ్‌లో ఉన్న ఒక నేత, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మరో నేత, అలాగే ఇసుక వ్యాపారంలో ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు… ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు… ఈ దాడుల జాబితాలో ఉన్నట్లు చెప్పారు.

అలాగే ఉత్తరాంధ్ర, నెల్లూరు జిల్లాలకు చెందిన మరో ఇద్దరు మంత్రులు, గుంటూరు జిల్లాకు చెందిన ఒక సంపన్న ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మరో నేత, పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక బిజినెస్‌తో సంబంధం ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక సంపన్న ఎంపీపై ఈడీ, ఐటీ దాడు దాడులు జరిగే అవకాశం ఉందని తనకు సమాచారం ఉందని భరద్వాజ వివరించారు.

చదవండి: చంద్రబాబు చెన్నై టూర్: స్టాలిన్‌, కనిమొళిలతో భేటీ.. చర్చలు, పూర్తిగా సహకరిస్తానన్న స్టాలిన్

- Advertisement -