గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య.. మాటువేసి మారణాయుధాలతో దాడి

- Advertisement -

గుంటూరు: జిల్లాలోని గురజాల మండలంలో పాతకక్షలకు ఓ టీడీపీ కార్యకర్త బలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని అంబాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త దోమతోటి విక్రమ్ గత అర్ధరాత్రి బైక్‌పై వెళ్తుండగా మాటువేసిన ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడిచేశాడు.

ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన విక్రమ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాతకక్షలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

- Advertisement -
- Advertisement -