చంద్రబాబుకి ఊహించని కానుక ఇచ్చిన టీడీపీ కార్యకర్త….

8:36 am, Sat, 4 May 19
Tdp activist surprising gift to chandrababu

అమరావతి: రాజకీయ నాయకులపై అభిమానం ఉన్న కార్యకర్తలు ఎవరైనా…తమ నాయకుడికి సంబంధించి బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టి అభిమానం తెలుపుకుంటారు. ఇంకా చాలా రకాలుగా కార్యకర్తలు తమ నాయకుడిపై అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఓ టీడీపీ కార్యకర్త అధినేత చంద్రబాబుకి ఊహించని కానుక ఇచ్చాడు.  విపరీతమైన అభిమానం ఉన్న ఓ కార్యకర్త… రాష్ట్రం కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్న చంద్రబాబుకు…. వేళకు భోజనం చేయాలనే ఉద్దేశంతో సరికొత్త బహుమతిని అందించాడు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ముందు పాలించే చంద్రబాబు ఆరోగ్యం ఉండాలని భావించి… చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త రామానుజం చలపతి చంద్రబాబు గడియారం, లంచ్ బాక్స్‌ను బహుమతిగా ఇచ్చాడు.

అయితే తమ అధినేత వేళకి భోజనం చేసి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ ఈ బహుమతి ఇచ్చినట్లు చలపతి తెలిపారు. కార్యకర్త ఇచ్చిన ఈ గిఫ్ట్ చూసిన చంద్రబాబు ఎంతగానో ఆనందించారని చెప్పారు. ఇక తన ఆరోగ్యం గురించి ఇంత శ్రద్ధ తీసుకున్న కార్యకర్త చలపతిని చంద్రబాబు అభినందించారు.

చదవండి: ఏఎంబీ మాల్‌లో ‘అవెంజర్స్: ది ఎండ్ గేమ్’ సినిమా చూసిన వైఎస్ జగన్…