గవర్నర్ ప్రసంగానికీ సవరణలు.. మండలి చైర్మన్‌కు టీడీపీ లేఖలు

- Advertisement -

అమరావతి: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగానికి శాసనమండలిలో టీడీపీ నేతలు సవరణలు కోరారు.

ఈ మేరకు మండలి ఛైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు లేఖలు అందించారు. గవర్నర్ ప్రసంగంలో వృద్ధిరేటుపై వెల్లడించిన లెక్కలు సత్యాదూరాలని పేర్కొన్నారు.

- Advertisement -

రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమం విషయంలో కూడా తప్పుడు సమాచారం ఉందని టీడీపీ ఎమ్మెల్సీలు లేఖలో తెలిపారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించలేదని, ప్రజలపై అధికారపార్టీ నేతల దాడుల గురించి మాట్లాడలేదని విమర్శించారు. బలహీన వర్గాల సంక్షేమాన్ని ప్రభుత్వం మరిచిపోయిందని పేర్కొన్నారు.

- Advertisement -