ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అచ్చెన్నాయుడు.. విజయవాడ సబ్‌జైలుకు తరలింపు

- Advertisement -

విజయవాడ: ఈఎస్ఐ మందుల కుంభకోణంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోగ్యం కుదుటపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందారు. ఏసీబీ అధికారులు కూడా ఆయనను ఆసుపత్రిలోనే మూడు రోజుల పాటు విచారించారు.

ప్రస్తుతం అచ్చెన్న ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఆయనను నేడు డిశ్చార్జ్ చేశారు. దీంతో పోలీసులు ఆయనను విజయవాడ సబ్ జైలుకు పోలీసులు తరలించారు. మరోవైపు తనకు అన్ని పరీక్షలు చేసిన తర్వాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కోరుతూ అచ్చెన్నాయుడులేఖ రాశారు.

- Advertisement -

కొలనోస్కోపీ పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదని లేఖలో పేర్కొన్నారు. కరోనా పరీక్షలు చేయకుండా అధికారులు జైల్లోకి అనుమతించరని, కాబట్టి తనకు కరోనా పరీక్షలను నిర్వహించాలని కోరారు.

ఆసుపత్రి నుంచి అచ్చెన్నాయుడు విడుదలవుతున్నారన్న వార్త తెలియగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారందరి మధ్య నుంచే అచ్చన్నాయుడిని అధికారులు జైలుకు తరలించారు.

- Advertisement -