రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న వ్యక్తిని కాపాడి.. తన కారులో ఆసుపత్రికి తరలించిన భూమా అఖిలప్రియ

- Advertisement -

కర్నూలు: టీడీపీ మహిళానేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా దీబగుంట్ల వద్ద మల్లికార్జున అనే వ్యక్తి రోడ్డప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో పడివుండడాన్ని అదే మార్గంలో వెళుతున్న అఖిలప్రియ గమనించారు.

మల్లికార్జున పరిస్థితిని గమనించిన ఆమె వెంటనే తన వాహనం ఆపి, స్థానికుల సాయంతో అతడిని తన వాహనంలో చేర్చి నంద్యాల ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న టీడీపీ సిద్ధాంత ఆచరణ ఇలాగే ఉంటుందని ట్వీట్ చేసింది.

- Advertisement -

- Advertisement -