శ్రీకాకుళం: జిల్లాకు చెందిన టీడీపీ నేత కూన రవికుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తేడా వస్తే లేపేస్తానంటూ వైసీపీ నేత మోహన్‌ను బెదిరించారు. పొందూరు మండలానికి చెందిన మోహన్ గతంలో టీడీపీలోనే ఉన్నారు.
ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరారు. అయితే పొందూరులోని మోహన్ బిల్డింగ్‌లోనే టీడీపీ కార్యాలయం ఉంది. వైసీపీ నేతల నుంచి ఒత్తిడి వస్తుండటంతో టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ కూనకు ఆయన ఫోన్ చేశారు.
మోహన్ ఫోన్ పట్ల కూన దురుసుగా ప్రవర్తించారు. ఆఫీసును ఖాళీ చేసే ప్రసక్తే లేదని, ఏం చేసుకుంటావో చేసుకోమంటూ
ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, ఏది ఏమైనా తన బిల్డింగ్ ను ఖాళీ చేయాల్సిందేనని మోహన్ అన్నారు. దీంతో మర్యాదగా ఉండకపోతే మర్యాద తప్పాల్సి వస్తుందని కూన హెచ్చరించారు. తేడా వస్తే లేపేస్తానంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.