జగన్‌రెడ్డి పాలనలో ఏపీ ‘ఈజ్ ఆఫ్ కిల్లింగ్ బిజినెస్‌లో నంబర్ వన్’

- Advertisement -

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు హయాంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజిజెన్‌లో నంబర్‌ వన్‌గా ఉండేదని, కానీ జగన్ రెడ్డి రాజ్యంలో ఏపీ ఈజ్ ఆఫ్ కిల్లింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్‌గా మారిందని ఎద్దేవా చేశారు.

జగన్ రెడ్డి పాలన చూసి రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రావడం లేదని, ఉన్న కంపెనీలను ఆయన ఉండనివ్వడం లేదని అన్నారు. పార్టీలో చేరితే కండువా కప్పుతున్నారని, లేకపోతే వేధిస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

ఎన్నికలకు ముందు ఒక్క చాన్స్ అంటూ హామీల వర్షం కురిపించిన జగన్.. గెలిచిన తర్వాత ‘షరతులు వర్తిస్తాయి’
అంటూ మొహం చాటేశారని ధ్వజమెత్తారు.

నవరత్నాలు తెచ్చిపోస్తానని ఇప్పుడు నవరత్న తైలంతో సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో రద్దులు, భారాలు, మోసాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని లోకేశ్ మండిపడ్డారు.

- Advertisement -